సిరియా నుండి స్వదేశాయానికి చేరిన నలుగురు భారతీయులు..! 8 d ago
సిరియాలో నెలకొన్న ఆందోళన పరిస్థితులు వల్ల అక్కడ ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి రప్పిస్తుంది. శనివారం నలుగురు భారతీయులు ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. సిరియాలోని కల్లోల పరిస్థితులతో వనికిపోయిన వారు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి భారత దౌత్య కార్యాలయం స్పందించిన తీరును ప్రశంసించారు. అనంతరం వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను మీడియాకు వివరించారు.